Thursday, December 12, 2024

AP | జగన్ భూములకు ప్రభుత్వ టెండర్.. సరస్వతి పవర్ కు ఇచ్చిన ల్యాండ్స్ వెనక్కి

మొత్తం 17.69 ఎకరాల భూమి ప్రభుత్వ స్వాధీనం
అమరావతి – ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌కు కూట‌మి ప్ర‌భుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. స‌ర‌స్వ‌తి ప‌వ‌ర్ అసైన్డ్ భూముల‌ను వెన‌క్కి తీసుకుంటూ ప్ర‌భుత్వం తాజాగా నిర్ణ‌యం తీసుకుంది. మాచ‌వ‌రం మండ‌లంలోని 17.69 ఎక‌రాల భూముల‌ను వెన‌క్కి తీసుకుంటున్నట్లు ఉత్త‌ర్వులు జారీ చేసింది.

అస‌లేం జ‌రిగిందంటే..
ఇటీవ‌ల వైఎస్ జ‌గ‌న్‌, ఆయ‌న సోద‌రి ష‌ర్మిల‌, త‌ల్లి విజ‌య‌మ్మ ఆస్తుల వివాదం కోర్టుకు చేరింది. దాంతో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆదేశాల మేర‌కు అధికారులు జ‌గ‌న్ తాలూకు మాచ‌వ‌రానికి చెందిన స‌రస్వ‌తి ప‌వ‌ర్ అసైన్డ్ భూముల‌ను ప‌రిశీలించారు. ఈ సంస్థ‌కు చెందిన భూముల‌పై ఆరా తీయాల్సిందిగా అధికారుల‌ను ప‌వ‌న్ ఆదేశించారు. ఆయ‌న ఆదేశాల మేర‌కు అధికారులు ఆర్ఎస్ఆర్‌, ఎఫ్ఎంబీ రికార్డుల‌ను అధికారులు చెక్ చేశారు.

మాచ‌వరం ఎంఆర్ఓ క్ష‌మారాణి, వీఆర్ఓ అఖిల్‌, ఆర్ఐ కోటేశ్వ‌ర‌రావు, స‌ర్వేయ‌ర్ సాల్మ‌న్ రాజు, దాచేప‌ల్లి అట‌వీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి కే విజ‌య‌ల‌క్ష్మీ, బీట్ ఆఫీస‌ర్లు వెంక‌టేశ్వ‌ర్లు, మ‌నోజ్.. స‌రస్వ‌తి సిమెంట్‌, ప‌వ‌ర్ భూముల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించి ప్ర‌భుత్వానికి నివేదిక అంద‌జేశారు. ఆ నివేదిక ఆధారంగా మాచ‌వ‌రం మండ‌లంలోని 17.69 ఎక‌రాల భూముల‌ను వెన‌క్కి తీసుకుంటున్నట్లు స‌ర్కార్‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement