ప్రభుత్వం కొత్తగా చేపట్టిన జిల్లాల విభజనపై పునరాలోచించుకోవాలని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ….. ప్రస్తుతం ఉద్యోగుల ఉద్యమాన్ని నీరు గార్చేందుకే కొత్త జిల్లాల ప్రతిపాదనను సీఎం జగన్ తీసుకొచ్చారని అన్నారు. కొత్త జిల్లాల విభజన దారుణంగా ఉందన్నారు.
కొత్త జిల్లాల విభజన ఫేక్‌గా తయారైందన్నారు. సీఎం ను ప్రసన్నం చేసుకునేందుకు ఎమ్మెల్యేలు కొత్త జిల్లాల ఏర్పాటు పై సంబరాలు చేసుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం జిల్లాల విభజన పై పునారాలోచించుకోవాలన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఇష్టానుసారంగా జిల్లాల విభజన ప్రక్రియ చేపట్టారని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేలకు మాట్లాడే ధైర్యం లేదని మండిపడ్డారు. అభివృద్ధి పనులు చేయలేదని ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలంటూ సూర్య ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..