Friday, November 22, 2024

పదో తరగతి ఫెయిల్‌కి ప్రభుత్వమే బాధ్యత వహించాలి : సీపీఎం

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఫెయిల్‌ అవ్వటం పట్ల సిపిఎం రాష్ట్ర కమిటీ- ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, దీనిపై సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని ఆ పారీ ్ట రాష్ట్ర కార్యదర్శి కోరారు. ఈ సంవత్సరం వివిధ కారణాలతో విద్యార్థులు బాగా డిస్టర్బ్‌ అయ్యార ని, కరోనా ఒకవైపు, సకాలంలో స్కూళ్ళు తెరుచుకోకపోవటం, తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోవడం, సిలబస్‌ పూర్తి కాకపోవడం, అన్నిటికన్నా మించి పరీక్ష పేపర్‌ లీక్‌లతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారని అన్నారు.

దీని ప్రభావం ఫలితాల మీద కనిపించిందని, మేధావులు, విద్యావేత్తలు, విద్యార్ధి, ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో ఈ ఫలితాలు, వాటికి గల కారణాల గురించి చర్చించి భవిష్యత్తులో ఇలా జరుగకుండా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement