తిరుపతి : కరోనా కేసులు అత్యధిక స్థాయిలో నమోదవుతున్నా… రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని జనసేన పార్టీ నేతలు అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ నిరసన దీక్ష చేపట్టింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… అన్ని రాష్ట్రాల్లో విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసుల ద్వారా విద్యను బోధిస్తుంటే మన రాష్ట్రంలో కనీస జాగ్రత్తలు లేకుండా పాఠశాలలు నిర్వహిస్తున్నారన్నారు. విద్యార్థులకు వెంటనే ఆన్ లైన్ క్లాసుల ద్వారా విద్యను బోధించి తగు జాగ్రత్తలు చేపట్టాలని జనసేన నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి, జిల్లా నాయకులు రాజేష్ యాదవ్, సుమన్ బాబు, బలరాం, రమేష్, మునిస్వామి, వీర మహిళలు, జిల్లా కార్యదర్శులు కీర్తన, అమృత, అరుణ, జనసైనికులు మనోజ్, కిషోర్, సాయి దేవ్, రాజేష్, హేమంత్, రాజేంద్ర, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..