అమరావతి, ఆంధ్రప్రభ: ఉద్యోగుల బదిలీలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు సంబంధించి మంగళవారం మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీచేసింది. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రతి ఉద్యోగికి భరోసా కల్పించటమే ప్రభుత్వ ఉద్దేశమని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మెరుగైన..సమర్థవంతమైన పాలనను ప్రజలకు చేరువ చేయటంలో ఉద్యోగులు తమవంతు కర్తవ్యాలను నెరవేర్చాలని ఈక్రమంలోనే ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఉత్తర్వులను రద్దుచేస్తూ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈనెల 8 నుంచి 17 వరకు బదిలీల్లో సడలింపునిచ్చింది. ఉద్యోగుల వాంఛనీయ ఉత్పాదకత నిబద్దతను మెరుగుపరచటమే ప్రభుత్వ అభివృద్ధి లక్ష్యాలని వివరించింది. పాలనాపరమైన కారణాల రీత్యా బదిలీల అభ్యర్థనలు పరిగణనలోకి తీసుకుంటారు. ఐదేళ్లు పూర్తిచేసిన ఉద్యోగులు బదిలీకి అర్హులు. అన్ని కేడర్లలో పని వ్యవధిని లెక్కగట్టి బదిలీల ప్రక్రియను నిర్వహిస్తారు. 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్న దివ్యాంగులు, మానసిక వికలాంగులైన పిల్లలు కలిగిన ఉద్యోగులు, వైద్యపరంగా క్యాన్సర్, సర్జరీ, కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ తదితర సమస్యలు ఉన్న వారికి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండే ప్రాంతానికి బదిలీ చేసే విషయంలో ప్రాధాన్యత ఉంటుంది. కారుణ్య నియామకాల కింద పనిచేసే ఉద్యోగులకు వెసులుబాటు కలుగుతుంది.
స్పౌజ్ (భార్యా,భర్తల) కేసులో ఒకర్ని మాత్రమే బదిలీ చేయాలి. ఒకసారి బదిలీకి అభ్యర్థన చేసుకుంటే ఆ తరువాత 8 ఏళ్లకు అవకాశం ఉంటుంది. ఉద్యోగుల సూచనలను అనుసరించి అన్ని బదిలీలు ప్రభావితమవుతాయి. ప్రస్తుతం పనిచేసే స్టేషన్ల ప్రాధాన్యత మంజూరు ప్రయోజనాలకు అభ్యర్థన బదిలీగా పరిగణిస్తారు. టీటీఏ ఇతర బదిలీ ప్రయోజనాలు వర్తిస్తాయి. ఒకే ప్రదేశంలో నిర్దేశిత గడువుకు మించి పనిచేస్తున్న ఉద్యోగులు స్థిరంగా బదిలీ అవుతారు. వారికి వేరే ప్రదేశంలో పోస్టింగ్ లేకపోతే పదోన్నతి పరిశీలిస్తారు. నోటిఫైడ్ ఏజెన్సీ ప్రాంతాల్లోనిఅన్ని ఖాళీలు, పోస్టులు ముందుగా భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఐటీడీఏ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు (లోకల్ , జోనల్ క్యాడర్) రెండేళ్ల కంటే ఎక్కువ కాలానికి వారు ఎంచుకున్న ప్రదేశానికి నిబంధనలకు లోబడి బదిలీ చేసే వీలుంది. మధ్యంతర , సీనియారిటీ ప్రాతిపదికన తగిన ప్రాధాన్యత ఉంటుంది. ఐటీడీఏ ప్రదేశాల్లో పోస్టింగ్ ఇవ్వాలంటే 50 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉండాలి. ఐటీడీఏ పరిధిలో ఇంతకు ముందు పనిచేయని ఉద్యోగులు సాధారణ ప్రాంతాలకు బదిలీ అవుతారు. ఐటీడీఏతో పాటు ఎక్కువ సంఖ్యలో అంతర్గత, వెనుకబడిన ప్రాంతాల్లో బదిలీల్లో ఖాళీలను భర్తీ చేసేటప్పుడు ఖాళీలకు తగిన ప్రాధాన్యత ఉంటుంది. హెచ్‌ఓడీీలు, జిల్లా కలెక్టర్లు దీన్ని నిర్థారించాలి. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించి నిబంధనల మేరకు బదిలీల ప్రక్రియ నిర్వహించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
అన్ని బదిలీలు ఇప్పటికి ఉన్న ప్రకారం సంబంధిత అధికారులు అమలు చేస్తారు. సంబంధిత విభాగాధిపతులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. బదిలీ ఉత్తర్వులు ఎలాంటి ఫిర్యాదులు, అవకతవకలు, అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా పాటించాలి. మార్గదర్శకాల ఉల్లంఘిస్తే ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. ఆదాయాన్ని ఆర్జించే విభాగాలైన వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణాశాఖ వ్యవసాయ విభాగం ఆయా శాఖలకు సంబంధించిన సొంత బదిలీ మార్గదర్శకాలు అమలు చేయాలి. జూన్ 17నాటికి ఈ ప్రక్రియ పూర్తికావాలి. డిపార్టుమెంట్లు (ఉన్నత విద్య, స్కిల్ డెవలప్‌మెంట్, ఏపీవీవీపీ (వైద్య విధానపరిషత్) మినహా శిక్షణ, ఆరోగ్యం, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖలకు మినహాయింపు ఉంది. పునర్నిర్మాణంలో సేవలందించేందుకు ఆర్డర్ల ద్వారా చేసిన బదిలీలు, పోస్టింగులు జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో జిల్లా, డివిజన్ కార్యాలయాలకు కూడా మినహాయింపు ఉంటుంది. గుర్తింపు పొందిన ఉద్యోగుల ఆఫీసు బేరర్ల బదిలీలపై స్టాండింగ్ సుచనలు పరిగణనలోకి తీసుకుంటారు. దృష్టిలోపం ఉన్న ఉద్యోగులు బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది. బదిలీ కోసం నిర్దిష్ట అభ్యర్థన చేసుకుంటే వీలైనంత వరకు వెసులుబాటు కల్పిస్తారు. అయితే స్పష్టమైన ఖాలీల లభ్యతకు లోబడి వారు కోరుకున్న ప్రదేశంలో పోస్టింగ్ ఇస్తారు. ఏసీబీ, విజిలెన్స్ కేసులు పెండింగ్‌లో ఉన్న వారి అభ్యర్థనలు బదిలీ కోసం వ్యతిరేకంగా పరిగణించరు. సంబంధిత అథారిటీ వాస్తవాలను పరిశీలించాల్సి ఉంటుంది. బదిలీలపై తిరిగి జూన్ 18 నుంచి నిషేధం అమల్లోకి వస్తుంది. ఏపీ ఈ గజెట్‌లో ఉత్తర్వుల కాపీ అందుబాటులో ఉంచుతారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.