Saturday, November 23, 2024

బదిలీల కోసం వైద్యుల ఎదురుచూపు.. అర్హత ఉన్నా పట్టించుకోని ప్రభుత్వం..

కర్నూలు, ప్రభన్యూస్ : కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో 300 మంది వైద్యులున్నారు. ఇందులో 20 నుంచి 30 మంది వరకు స్తానిక వైద్యులు ఉండగా, మిగిలిన వారు సీమలోని అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాకు చెందిన పలువురు వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా జనరల్‌ ట్రాన్స్‌ఫర్లు చేయాల్సి ఉంది. అయితే 2019 నుంచి మూడేళ్లుగా సాధారణ ట్రాన్స్‌ఫర్‌లు మొదలుకొని రిక్వేస్టు ట్రాన్స్‌ఫర్‌, డిప్యూటేషన్‌లు రద్దు చేసిన నేపథ్యంలో వైద్యుల్లో ఆందోళన నెలకొంది. సాధారణ రిక్వేస్టు, డిప్యూటేషన్‌లకు అర్హులైన వైద్యులకు కొంతలో కొంత ఉపశమనం లభించేది. అలా కాకుండా చాలమంది వైద్యులు ప్రవేట్‌ ప్రాక్టీస్‌ చేసుకుంటున్నారనే కోణంలో జనరల్‌ ట్రాన్స్‌ఫర్‌ మొదలుకొని, రిక్వేస్టు ట్రాన్స్‌ఫర్స్‌, డిప్యూటేషన్స్‌ వరకు బదిలీలను రద్దు చేయడంలో వీరిలో అనేక కుటుంబాలు అనారోగ్య, స్పౌస్‌ సమస్యలు ఎదుర్కుంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న వైద్యశాలలైన కడప, ఒంగోలు, చిత్తూరు, కర్నూలు వైద్య కళాశాలలకు బదిలీపై నిపుణ వైద్యులు వస్తామన్న కూడా బదిలీలకు అనుమతించక పోవడం విస్మయం కలిగిస్తుంది. బదిలీలను గురించి అడిగితే ముఖ్యమంత్రి వద్దకు సంతకాలకు వెళ్లాల్సి ఉందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొనడం గమనార్హం. మొత్తంగా అర్హులైన బదిలీలకు అర్హులైన వైద్యులు సిద్దంగా ఉన్నప్పటికి ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. దీంతో సాధారణ బదిలీల కోసం పలువురు వైద్యులు ఎదురుచూస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement