ఖమ్మం: తెలంగాణలో త్వరలో వెలువడనున్న ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి .. తమ బంగారు కెరీర్ కోసం రైట్ ఛాయిస్ కోచింగ్ సెంటర్ సరైందని ప్రముఖ రాష్ట్ర స్థాయి హిస్టరీ ఫాకల్టీ కరీం సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు ఎప్పుడో కానీ రావని.. ఇందులో విజయం సాధించాలంటే .. రైట్ ఛాయిస్ ను ఎంపిక చేసుకోవాలని కోరారు. ఉద్యోగ అవకాశాల్లో విజయం సాధిండమెలా అనే అంశంపై ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా ముందు నుంచే విద్యార్థులు సన్నద్ధం కావాలని కోరారు. పోటీపరీక్షలకు ప్రామాణిక పుస్తకాలను ఎంచుకోవాలని, వాటిని వీలైనన్ని ఎక్కువ సార్లు అధ్యయనం చేయాలని సూచించారు. తక్కువ సమయంలో ఎక్కువ ఉద్యోగాలు సాధించిన ఘనత రైట్ ఛాయిస్‌కు దక్కిందని కరెంట్ ఎఫైర్స్ ఫాకల్టీ రాములు చెప్పారు. రైట్ ఛాయిస్ చైర్మన్ కిరణ్ మాట్లాడుతూ…కేవలం ముగ్గురు విద్యార్థులతో ప్రారంభించిన తమ సంస్థ అనతి కాలంలోనే 1200 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించే స్థాయికి ఎదిగిందన్నారు. కొద్ది రోజుల్లో వెలువడనున్న ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి.. కానిస్టేబుల్, ఎస్ ఐ, గ్రూప్స్ ఉద్యోగాల్లో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఉద్యోగాన్ని సాధించాలన్న కసి, అందుకు చేయాల్సిన కృషి, పట్టుదల, చదువు పట్ల అంకిత భావం ఉన్న విద్యార్థులు మాత్రమే అడ్మిషన్లకు రావాలన్నారు. ఈ అవగాహన సదస్సులో సీనియర్ ఫాకల్టీలు లెనిన్, మహేందర్ అగర్వాల్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. సదస్సులో పాల్గొన్న అనేక మంది విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement