సంక్రాంతి పండుగ సందర్భంగా బ్యాంకు ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి పండుగ సెలవులను మరో రోజు పొడిగించారు. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా, 2025 ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేవలం సంక్రాంతి రోజునే సెలవు దినంగా ప్రకటించగా… కనుమ రోజు కూడా సెలవు ప్రకటించాలని యునైటెడ్ ఫోరమ్ ఫర్ బ్యాంక్ యూనియన్స్, ఏపీ స్టేట్ యూనియన్ అభ్యర్థించాయి. దీనికి సానుకూలంగా స్పందించిన సర్కారు.. కనుమ రోజు కూడా సెలవును పొడిగించింది. దీంతో మంగళ, బుధవారాల్లో బ్యాంకులకు సెలవులు ఉండనుంది.