చేజర్ల (ప్రభ న్యూస్) : ప్రభుత్వం నుంచి వేతనాలు పొందుతున్న ఉద్యోగులు ఎన్నికల నియమావళిని పాటించాలని, రాజకీయ ప్రచారాలు, సమావేశాల్లో పాల్గొనకూడదని ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే కొందరు ఈ ఆదేశాలను బేఖాతారు చేస్తూ అడుగడుగునా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు.
మండలంలోని బోడిపాడు గ్రామంలో (శనివారం) కొండా రెడ్డి నివాసంలో స్థానిక వైకాపా నాయకులు మేకపాటి విక్రమ్‌రెడ్డి క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యనమదల గ్రామానికి చెందిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ప్రదీష్ పాల్గొన్నారు.
ప్రభుత్వం నుంచి వేతనాలు పొందుతున్నప్పటికీ వారిలో సంతృప్తి కనిపించడం లేదు. జీతాలు తీసుకుంటున్నాం… అయితే ఏమవుతుందనే విధంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ విషయంపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి వివరణ కోరగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.