ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ఉంటుందని ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ప్రసంగిస్తూ… కొత్త జిల్లాలతో ప్రజలకు మెరుగైన సేవలందనున్నాయన్నారు. వికేంద్రీకరణతోనే రాష్టం డెవలప్ మెంట్ అవుతుందన్నారు. కరోనాతో దేశం, రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయన్నారు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇచ్చామన్నారు. కరోనా ఇబ్బందుల్లోనూ 23శాతం ఫిట్ మెంట్ ఇచ్చామన్నారు. పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచామన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement