ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర మనస్తాపానికి గురై కన్నీటిపర్యంతమయ్యారు. మీడియా ముందు ఎక్కెక్కి ఏడ్చారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీచమైన పదానికి అర్థం వైసీపీ పార్టీ అని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడితో కన్నీరు పెట్టించారని మండిపడ్డారు. అసలు, వైసీపీలో విజ్ఞత గల నాయకులు ఉన్నారా? లేక పనికిమాలిన నేతలు మాత్రమే ఉన్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ వెకిలి నవ్వులు నవ్వుతుండడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు. ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని గోరంట్ల హెచ్చరించారు.
‘’చంద్రబాబుని తరువాత చూద్దురు ముఖ్యమంత్రి గారు..ముందు ఆ తాడేపల్లి కొంప దాటి బయటకి వచ్చి వరదల్లో చిక్కుకున్న జనాల్ని చూడండి.వారికి సహాయం అందించండి.’’ అని గోరంట్ల పేర్కొన్నారు.