Friday, November 22, 2024

ఇసుక మైనింగ్ పై టిడిపి నేతల ఆరోపణలు అవాస్తవాలే

ఇసుక మైనింగ్ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వివరణ ఇచ్చారు. టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు. ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ప్రయత్నిస్తున్నారని, తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ఏపీలో జేపీ పవర్ వెంచర్స్ కు మాత్రమే మైనింగ్ కేటాయింపులు చేశామని, టెండర్ల ద్వారా నిబంధనల ప్రకారమే కేటాయించినట్టు వెల్లడించారు. సీఎంవో సిఫారసులతో సుధాకర్ ఇన్ ఫ్రా సంస్థకు గోదావరిలో ఇసుక డ్రెడ్జింగ్ అనుమతులు ఇచ్చామన్నది అబద్ధమని స్పష్టం చేశారు. ఈ అంశంలో సుధాకర్ ఇన్ ఫ్రాపై విజయవాడలో కేసు కూడా నమోదైందని, జేపీ సంస్థ నుంచి సబ్ కాంట్రాక్టు పొందినట్టుగా చెప్పుకుంటున్నట్టు సుధాకర్ ఇన్ ఫ్రాపై ఆరోపణలు వచ్చాయని ద్వివేది తెలిపారు. టీడీపీ నేతలు ఫోర్జరీ డాక్యుమెంట్లను విడుదల చేసి, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ద్వివేది ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement