Home ఆంధ్ర‌ప్ర‌దేశ్ AP | విశాఖలో గూగుల్ కార్యాల‌యం..

AP | విశాఖలో గూగుల్ కార్యాల‌యం..

0
  • గూగుల్ తో ఎంవోయు కుదుర్చుకున్న ప్రభుత్వం
  • చంద్ర‌బాబు, నారా లోకేష్ స‌మ‌క్షంలో సంత‌కాలు
  • గూగుల్ విశాఖ‌కు రావ‌డం గేమ్ ఛేంజ‌ర్ అన్న సిఎం
  • పెద్ద ప్రాజెక్ట్ తెచ్చిన చంద్ర‌బాబును అభినందించిన ప‌వ‌న్
  • అమరావతి: ప్రతి సంక్షోభంలో అవకాశాలు ఉంటాయని, సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వమని, ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విశాఖ‌లో గూగుల్ సంస్థ త‌న కార్యాల‌యం ఏర్పాటు చేసేందుకు ముఖ్య‌మంత్రి నివాసంలో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు, నారా లోకేష్ ల స‌మ‌క్షంలో ఆ కంపెనీ ప్ర‌తినిధులు నేడు ప్ర‌భుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు.. ఒప్పంద ప‌త్రాల‌పై సంత‌కాలు చేశారు.. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావని, నిరంతరం ప్రయత్నిస్తుంటేనే ఫలితాలు వస్తాయన్నారు. విశాఖలో గూగుల్ ఏర్పాటుకు ఎంవోయూ కుదిరిందన్నారు.

వైజాగ్‌లో గూగుల్ ఏర్పాటు..
ఐటి మంత్రి లోకేష్ అమెరికా వెళ్లి గూగుల్ వారిని సంప్రదించడంతో వారు వైజాగ్ రావడానికి ఒప్పుకున్నారని, ఇప్పడు వారితో ఒప్పందం చేసుకున్నామని చంద్రబాబు తెలిపారు. మంత్రి లోకేష్ కృషితో గూగుల్ ఏర్పాటుకు మార్గం సుగమమైందని చెప్పారు. గూగుల్‌ ఎంవోయూతో విశాఖలో అధిక అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ మంచి సిటీ అని గుర్తించామని గూగుల్ వాళ్లు చెబుతున్నారన్నారు. విశాఖకు గూగుల్ వాళ్లు వస్తున్నారంటే అది ఓ గేమ్ చేంజర్ అవుతుందన్నారు.

విశాఖలో డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, సీ కేబుల్ కనెక్టివిటీ వస్తే విశాఖ ఓ డీప్ టెక్ డెస్టినేషన్ అవుతుందన్నారు. ప్రజలు హర్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలని కోరుతున్నానని, ఆర్టీజీఎస్‌తో గూగుల్ ఓ ఒప్పందం చేశారని, ఆ ఒప్పందం ఎంతో మేలు చేస్తుందన్నారు. విశాఖపట్నం ఏజెన్సీ ఏరియాలో గంజాయి ఎక్కడ ఉందనేది గ్రహించామని, గూగుల్ శాటిలైట్ ద్వారా గుర్తించి డ్రోన్లు పంపి నాశనం చేయగలుగుతామని, గూగుల్‌తో ఒప్పందం రాష్ట్రంలోని యువతకు గుడ్ న్యూస్ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

చంద్ర‌బాబుకు ప‌వ‌న్ అభినంద‌న‌లు…
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక అభినందలు తెలియజేశారు. ‘‘రాష్ట్రానికి గూగుల్‌‌ను తీసుకువచ్చేందుకు మీరు చేసిన ప్రయత్నం అభినందనీయం. ప్రతిసారి మీరు మీ సామర్ధ్యాన్ని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు’’ అంటూ సీఎంను పవన్ పొగడ్తలతో ముంచెత్తారు. బుధవారం ఉదయం సీఎం చంద్రబాబుతో గూగుల్ ప్రతినిధులు భేటీ అయ్యారు.

Exit mobile version