ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో శుక్రవారం మంగళగిరిలోని తన నివాసంలో సమావేశం అయ్యారు. ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు అందించాలన్న లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు గల అవకాశాలపై గ్రామీణ నీటి సరఫరాశాఖ మంత్రి హోదాలో సుదీర్ఘంగా చర్చించారు. గ్రామాలకు తాగునీరు అందించడమే తమ లక్ష్యమని పవన్ కల్యాణ్ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు తెలియజేశారు.
గత ప్రభుత్వంలా నిధులను పక్కదారి పట్టించబోమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్, ప్రపంచ బ్యాంక్ జలవనరుల విభాగం సలహాదారు రమేష్ ముకల్లా, మాథ్యూస్ ముల్లికల్ పాల్గొన్నారు.