అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్‌లో ఐదో సినిమాగా ‘ఓటు’ మూవీని శనివారం ఫస్ట్ డే ఫస్ట్ షోగా ప్రదర్శిస్తున్నట్లు ఫైబర్‌నెట్ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్) ఛైర్మన్ పూనూరు గౌతమ్‌రెడ్డి తెలిపారు. విజయవాడలోని ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ‘ఓటు’ చిత్ర బృందంతో కలిసి మీడియాతో ఆయన సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ ఫస్ట్ డే ఫస్ట్ షో లో భాగంగా ఫైబర్ నెట్‌లో 5వ సినిమాగా ‘ఓటు’ సినిమాను ప్రదర్శించనున్నట్లు చెప్పారు.
కేవలం రూ. 39 చెల్లించి ఇంటిల్లిపాది ఇంట్లో కూర్చుని సినిమాను 24 గంటల సమయంలో ఎన్నిసా్లంనా వీక్షించవచ్చన్నారుచిన్న సినిమాలకు చేయుతనివ్వాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘ఓటు’ సినిమాకు రవి దర్శకత్వం వహించగా, హ్రితిక్ శౌర్య, తన్వీ నేగీలు హీరో, హీరోయిన్లుగా పరిచయమవుతున్నారని, సంగీతం అగస్త్య అందించగా డివోపీగా రాజశేఖర్ వ్యవహరించారని వివరించారు. సందేశాత్మకంగా రూపొందించిన ఇలాంటి సినిమాలను ప్రజలు ఆదరించాలని ఆయన కోరారు.
సీఎం ఆలోచనలకు అనుగుణంగా..
ఇంటింటికి ఉచిత ఇంటర్‌నెట్ ఇవ్వాలన్న ముఖ్యమంత్రి ఆలోచనకు అనుగుణంగా ఫైబర్ నెట్ ద్వారా చర్యలు తీసుకుంటున్నామని గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. ఫైబర్‌నెట్ కనెక్షన్‌లు కోటికి చేరుకోవటానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ప్రతి గ్రామం చివరి ఇంటి వరకు ఇంటర్‌నెట్ ఇవ్వాలన్న లక్ష్యాన్ని త్వరలోనే చేరుకుంటామన్నారు. ఇంటర్‌నెట్ బాక్స్ ఉచితంగా అందించడమేగాక కేవలం రూ.190కే నెలరోజుల ప్లాన్ అందిస్తున్నామన్నారు.
వినియోదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రముఖ డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ సినిమాలను ఫస్ట్ డే ఫస్ట్ షో గా ఫైబర్ నెట్‌లో విడుదల చేసేందుకు ఇప్పటికే మౌఖిక ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. అనివార్యకారణాల వల్ల ఆర్జీవీ నూతన సినిమా ప్రదర్శన ఆలస్యమైందన్నారు. ఫైబర్ నెట్ యాప్‌ను కూడా అతిత్వరలో అందుబాటు-లోకి తీసుకురానున్నామని గౌతమ్ రెడ్డి తెలిపారు.
‘ఓటు’ తన మొదటి సినిమా అని హీరో శౌర్య తెలిపారు. ఓటు ప్రాధాన్యతను వివరించే మంచి సందేశాత్మక సినిమా అని, ఈ సినిమా ఎవ్వరికీ వ్యవతిరేకం కాదన్నారు. ఓటును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్న సందేశాన్ని ఈ సినిమాలో వివరించామన్నారు. అనంతరం ‘ఓటు’ సినిమా పోస్టర్ ను మూవీ టీంతో కలిసి గౌతమ్ రెడ్డి విడుదల చేశారు. కార్యక్రమంలో సినిమా నిర్మాత రామకృష్ణ, ఓటు చిత్ర బృందం, తదితరులు పాల్గొన్నారు.