అమరావతి, ఆంధ్రప్రభ : ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.. కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్ లో పని చేసే ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ ను ప్రభుత్వం పెంచింది. హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఏ) ను 12 శాతం నుండి 16 శాతానికి ) పెంచేసింది పార్వతీపురం, పాడేరు, అమలాపురం, బాపట్ల, రాజమండ్రి, భీమవరం, నరసరావుపేట, పుట్టపర్తి, రాయచోటి జిల్లా కేంద్రాల ఉద్యోగులకు ఈ పెంచిన హెచ్‌ఆర్‌ఏ వర్తింపజేయనున్నారు.. ఉద్యోగుల వినతి మేరకు ప్రభుత్వం16 శాతానికి పెంచుతూ స్పెషల్ సీఎస్ రావత్ వుట్టర్వులు జారీ చేశారు.
కాగా, గత కొంతకాలంగా డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు పోరాటం చేస్తూనే ఉన్నారు.. పలు దఫాలుగా చర్చలు కూడా సాగుతోన్న విషయం విదితమే.. ఇదే సమయంలో.. కొన్ని డిమాండ్ల పరిష్కారానికి పూనుకున్న సీఎం జగన్ వాటి పరిష్కారంపై దృష్టి సారించారు.