దీపావళి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు ప్రకటించింది. ట్రైన్ నెం.. 07607/ 07608 పూర్ణ- తిరుపతి/ తిరుపతి- పూర్ణ ఎక్స్‌ప్రెస్ నవంబర్ 1, 2, 8, 9, 15, 16, 22, 23, 29, 30వ తేదీల్లో నడుస్తుందని పేర్కొంది.
ఈ ప్రత్యేక రైలు నాందేడ్, ముద్కేడ్, ధర్మాబాద్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్, సికింద్రాబాద్, కాజిపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగనుంది. ఇంటర్ లాకింగ్ పనుల సందర్భంగా హిందూపూర్, డబ్లింగ్ పనుల కారణంగా యలహంక- పెనుకొండ స్టేషన్ల మధ్య పలు రైళ్లను మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మరో ప్రకటనలో తెలిపింది.
09301/093 నెంబర్ గల డా. అంబేద్కర్ నగర్- యశ్వంత్‌పూర్/ యశ్వంత్‌పూర్- డా. అంబేద్కర్ నగర్ రైలు నవంబర్ 7, 9, 14, 16వ తేదీల్లో డోన్, గుంతకల్, బళ్లారి, రాయదుర్గ్, తుమకూరు స్టేషన్ల మధ్య నడుస్తుందని సూచించింది. అలాగే 02063/ 02064 పూరీ- యశ్వం త్‌పూర్/ యశ్వంత్‌పూర్- పూరి రైలు నవంబర్ 19, 20వ తేదీలలో డోన్, గుంతకల్, బళ్లారి, రాయదుర్గ్, తుమకూరు స్టేషన్ల మధ్య ప్రయాణిస్తుందని దక్షిణ మధ్య రైల్వే శాఖ తెలిపింది.
ఆపరేషనల్ పనుల కారణంగా ట్రైన్ నెం.. 07674 నిడదవోలు- నర్సాపూర్ రైలు అక్టోబర్ 26 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు 4 గంటలు ఆలస్యంగా నడుస్తుందని రైల్వే శాఖ తెలిపింది.