Monday, November 18, 2024

Good News: త్వరలోనే పోలీస్ శాఖలో ఖాళీల భర్తీ: సీఎం జగన్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు ఏపీ సీఎం వైఎస్ జగన్. పోలీస్ అమరువీరుల దినోత్సవం సందర్భంగా పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామని, త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామన్నారు. దేశంలో తొలిసారి వీక్లీ ఆఫ్ లను అమలు చేస్తున్నామని, అయితే కరోనా కారణంగా అది కొన్నాళ్లు వాయిదా పడిందన్నారు జ‌గ‌న్‌. దాన్ని ఇవాళ్టి నుంచి మళ్లీ అమలు చేస్తామని ఆయన ప్రకటించారు.

పోలీసుల సేవలను ప్రభుత్వం గుర్తిస్తుందని అందుకే గత ప్రభుత్వం బకాయిపడిన రూ.1,500 కోట్లు నిధులు రిలీజ్‌ చేశామని చెప్పారు సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి. హోంగార్డుల గౌరవ వేతనాన్నీ కూడా పెంచిన‌ట్టు ప్ర‌క‌టించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పోలీస్ శాఖలో కొత్తగా 16 వేల మందిని నియ‌మించిన‌ట్టు గుర్తుచేశారు. కరోనాతో చనిపోయిన పోలీసుల కుటుంబాలకు రూ.ఐదు లక్షల చొప్పున అందించామ‌న్నారు. మ్యాచింగ్ గ్రాంట్ కింద మరో రూ.5 లక్షలూ ఇస్తున్నామని చెప్పారు ఏపీ సీఎం.

టెక్నిక‌ల్ నాలెడ్జికి తగ్గట్టు పోలీసుల బాధ్యతలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం జ‌గ‌న్‌ పేర్కొన్నారు. వైట్ కాలర్ నేరాలను నియంత్రించేందుకు సాంకేతికతను వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement