తిరుమల వేంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ బోర్డు గుడ్‌న్యూస్‌చెప్పింది. భక్తులకు మే ఒకటో తేదీ నుంచి శ్రీవారి మెట్లు మార్గంలో కొండపైకి వచ్చేందుకు అనుమతిస్తున్నట్టు వెల్లడించింది. గత వానాకాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా పలుచోట్ల మెట్ల మార్గం కొట్టుకుపోయింది. దీంతో రిపేర్ల కారణంగా ఈ దారిలో భక్తులను రాకుండా నిలిపేశారు. కాగా, మరమ్మతులు పూర్తికావడంతో భక్తులకు తిరిగి అనుమతి స్తున్నట్లు అధికారులు తెలిపారు. నిన్న 76,746 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 31,574 మంది తలనీలాలు సమర్పించుకున్నట్టు టీటీడీ తెలిపింది. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా టీటీడీ హుండీకి రూ.4.62 కోట్లు ఆదాయం వచ్చిందని సంబంధిత అధికారులు వివరించారు.
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక మీదట ఆ దారిలో వెళ్లొచ్చు..
Advertisement
తాజా వార్తలు
Advertisement