Friday, November 22, 2024

సీమ రైతులకు గుడ్ న్యూస్‌.. ఖరీఫ్ సీజ‌న్‌లో డ్రోన్‌ల‌తో సేద్యం పనులు

రాయలసీమ, ప్రభ న్యూస్‌ ప్రతినిధి : రాయలసీమ రైతులకు తీపికబురు అందించింది వ్య‌వ‌సాయ శాఖ‌. ఖరీఫ్‌ సీజన్‌ నుండి రైతు భరోసా కేంద్రంలో డ్రోన్‌లు అందుబాటులో ఉంచి సేద్యానికి ఉప‌యోగించేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ హరికిరణ్‌ సీమలోని 8 జిల్లాల్లో మొదటి విడతగా 500 డ్రోన్లు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. డ్రోన్‌ పైలెట్లుగా సైన్స్‌ పట్టభద్రులను నియమించనున్నారు. ఇంటర్లో సైన్స్‌ చదువుతున్న విద్యార్థులను గుర్తించి నానో యూరియా వాడకంపై దృష్టి పెట్టాలనేది కమిషనర్‌ లక్ష్యం. ఖరీఫ్‌ సీజన్లో అన్నదాత సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ దిగుబడిని పెంచడానికి, ఖర్చు తగ్గించడానికి డ్రోన్లను వినియోగిస్తున్నారు.

చిత్తూరు జిల్లాకు 120, కడప జిల్లాకు 100, అనంతపురం జిల్లాకు 100, నంద్యాల జిల్లాకు 60, కర్నూలు జిల్లాకు 70, రాయచోటి పుట్టపర్తి శ్రీ బాలాజీ జిల్లాలకు కలిపి ఖరీఫ్‌ సీజన్లో 500 డ్రోన్‌ లను ఏర్పాటు- చేయనున్నారు.. ప్రతి మండలానికి కనీసం నాలుగు రైతు భరోసా కేంద్రాల్లో వీటిని అందుబాటు-లో ఉంచనున్నారు. ఇప్పటికే కమిషనర్‌ సీమ జిల్లాల ఎడి ఏ లతో డ్రోన్ల వినియోగంపై ప్రతి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహిస్తున్నారు.. సీమ జిల్లాల్లో 3541 రైతు భరోసా కేంద్రాలు ఉండగా. తొలి విడతలో. దాదాపు ఐదు వందల రైతు భరోసా కేంద్రాల్లో. డ్రోన్‌ లను ఏర్పాటు- చేయనున్నారు.

ప్రత్యేక శిక్షణ.
అన్నదాతలకు . కిసాన్‌ డ్రోన్లు, నిర్వహణ, వినియోగంపై కేంద్ర ప్రభుత్వ ఇటీ-వల రూపొందించిన మార్గదర్శకాలను వివరించిన అధికారులు ప్రతి ఆర్బీకేల పరిధిలో చదువుకుని పరిజ్ఞానం ఉన్న రైతులతో ప్రత్యేకంగా డ్రోన్‌ కమ్యూనిటీ- హైరింగ్‌ సెంటర్ల ఏర్పాటు- చేసి.. వారికి శిక్షణ ఇవ్వాలి. శిక్షణ అనంతరం వారికి సర్టిఫికెట్‌కూడా ఇవ్వాలి… రైతులందరికీ శిక్షణ ఇవ్వడానికి ఒక మాస్టర్‌ -టె-నర్‌ను గుర్తించాలి. …. ఒక డ్రోన్‌తో ఏరకంగా ఫెస్టిసైడ్స్‌ వినియోగించవచ్చు,.. ఏరకంగా ఫెర్టిలైజర్స్‌ వేయొచ్చో వివరించేలా రూపొందించిన వీడియోలను రైతుల్లో అవగాహన పెంచడానికి చూపించాలి. నానో ఫెర్టిలైజర్స్‌, నానో ఫెస్టిసైడ్స్‌ వస్తున్న నేపథ్యంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తాయి మోతాదుకు మించి రసాయనాల వినియోగం తగ్గుతుంది, దీనివల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది ఈ ఏడాదిలో డ్రోన్ల వినయోగించే పరిస్థితిలోకి వెళ్లాలి. డ్రోన్ల నిర్వహణపైన కూడా సరైన వ్యవస్థ ఉండాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement