Thursday, November 21, 2024

AP | అర్చకులకు, ఉద్యోగులకు శుభవార్త.. కనీస గౌరవ వేతనం రూ.10 వేలు

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర దేవాదాయ శాఖ అర్చకులకు, ఉద్యోగులకు శుభవార్త ఆందించింది. ఇప్పటి వరకు పది వేల లోపు ఉన్న అర్చకులకు 10 వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని, ఉద్యోగుల రి-టైర్మెంట్‌ వయసు 62కు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ అర్చకులకు న్యాయం చేయడం కోసం సీఎం జగన్‌ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దీంతో, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,146 మంది అర్చకులకు జీతాలు పెరుగుతున్నాయని వెల్లడించారు.

దేవాలయాల ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయస్సు పెంపునకు సంబంధించి బుధవారం ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన జరగనున్న కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారన్నారు. దేవాలయాల్లో సాంకేతిక సిబ్బంది కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. దేవాలయాల పరిరక్షణ కోసం సెక్షన్‌ 83లో మార్పులు తెస్తున్నామన్నారు. వివాదాస్పదమైన గ్రూప్‌ – 3 ఈఓల ప్రమోషన్ల ప్రక్రియను నిలిపి వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే పొన్నూరు భావన్నారాయణ స్వామి దేవాలయ భూములను ఆటో నగర్‌కు కేటాయించాలని ప్రతిపాదన వచ్చిందని.. ఇంకా. ఎలాంటి నిర్ణయం తీసుకొలేదన్నారు.

- Advertisement -

ఇదిలా వుండగా ఇప్పటికే రాష్ట్రంలో ఉండే కేటగిరి -1 దేవస్థానాలలో పనిచేసే అర్చకులకు గౌరవ వేతనం రూ. 15,625, కేటగిరి-2లో అర్చకులకు రూ. 10 వేలు దేవాదాయ శాఖ చెల్లిస్తుంది. అలాగే అర్చకులకు 100 శాతం వైద్య ఖర్చులు కూడా భరించనున్నట్లు- ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు రూ.10 లోపు గౌరవ వేతనం ఉన్న అర్చకులకు.. రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయించారు.. దీంతో, రాష్ట్రంలో 1,146 మంది అర్చకులకు లబ్ధి చేకూరనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement