Saturday, November 23, 2024

AP | కాంట్రాక్ట్ ఉద్యోగులను గుడ్‌న్యూస్‌.. రెగ్యులరైజ్ చేస్తూ జీవో విడుదల !

రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైద్య, ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎంఈలో 62 మంది, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 2,025 మంది, కుటుంబ సంక్షేమ శాఖలో 55 మంది, ఆయుష్, యునాని విభాగాల్లో 4 మందిని క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2014 ఏప్రిల్ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న 2,146 మంది పర్మినెంట్ ఉద్యోగుల కేటగిరీలోకి రానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement