Wednesday, December 18, 2024

AP | ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త..

ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ స‌ర్కార్ గుడ్ న్యూస్ వినిపించింది. ఉద్యోగుల నైటౌట్ అలవెన్సులపై ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నైటౌట్ అలవెన్స్ చెల్లింపునకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైటౌట్ అలవెన్సులు మంజూరు చేస్తూ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రోజుకు రూ.150 చొప్పున నైటౌట్ అలవెన్సులు మంజూరు చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు, కార్మిక నేతలు, ఉద్యోగులు ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement