ఏపీలో గత కొన్ని రోజులుగా వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. అయితే ప్రస్తుతం కరోనా పూర్తిగా కట్టడిలోకి వచ్చినట్లుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కరోనా మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో ప్రతిరోజూ.. కొత్తకేసులు నమోదవుతూనే ఉన్నాయి. కానీ.. నిన్న తొలిసారిగా ఏపీలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. 2020 మార్చి 9న ఏపీలో తొలికేసు నమోదైంది. తాజా ఏపీలో కరోనా కేసులు నిల్ అవడంతో.. అధికారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 2,163 మంది శాంపిల్స్ ను పరీక్షించగా.. ఒక్కరికి కూడా పాజిటివ్ అని నిర్ధారణ కాలేదు. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 23,19,662గా ఉంది. నిన్న మరో 12 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం ఏపీలో 22 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ.. జాగ్రత్తగా ఉంటే.. ఏపీని కరోనా ఫ్రీ రాష్ట్రంగా మార్చవచ్చని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement