Friday, November 22, 2024

AP : రైతుల‌కు గూడ్ న్యూస్‌… మూడో విడత రైతు భరోసా జమ

ఏపీ రైతులకు జగన్‌ సర్కార్‌ గుడ్‌ న్యూస్ అందించింది. ఇవాళ‌ వైఎస్సార్ రైతు భరోసా నిధులను ప్ర‌భుత్వం విడుదల చేయనుంది. వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు విడుదల చేయనున్నారు సీఎం జగన్‌.

- Advertisement -

ఈ పథకం ద్వారా రైతన్నలకు ఒక్కొక్కరికి ఏటా రూ.13,500 చొప్పున వరుసగా 4 ఏళ్ళు రైతు భరోసా సాయం అందించడంతో పాటు ఐదో ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో ఒక్కొక్కరికి అందించిన సాయం రూ. 11,500 అని ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఇవాళ మూడో విడతగా ఒక్కొక్కరికి మరో రూ. 2,000 చొప్పున 53.58 లక్షల మంది రైతన్న ఖాతాల్లో రూ. 1,078.36 కోట్లు జమ చేయనున్నారు సీఎం జగన్. రబీ 2021-22, ఖరీఫ్ 2022 లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 10,78,615 మంది రైతన్నలకు రూ.215.98 కోట్ల వడ్డీ రాయితీ సొమ్ము ను నేడు వారి ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement