యాదగిరి గుట్ట – ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణకు తీపి కబురు చెప్పనున్నారు. . ఆది నుంచీ తెలుగు వారి సంక్షేమం తన ప్రాధాన్యత అని పేర్కొంటున్న ఆయన కీలక, సుదీర్గ డిమాండ్ కు ఎస్ అన్నట్లు సమాచారం . అదే తిరుమల వెంకన్న దర్శనంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సులు ఆమోదించాలని గత కొంతకాలంగా కోరుతున్నారు.. దీనిపై ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారు.. . యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి అనంతరం మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో తిరుమల తర్వాత ఎక్కువగా భక్తులు సందర్శించే యాదగిరిగుట్ట నరసింహస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
టీటీడీ నూతన పాలకమండలి ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్ర ఎంపీ, ఎమ్మెల్యేల సిఫార్సు (లెటర్ ప్యాడ్స్) లేఖలను ఆమోదించి, దర్శనం కల్పిస్తామని తెలిపారు. “టీటీడీ కొత్త ట్రస్ట్ బోర్డ్ ఏర్పడడానికి 2 నెలల సమయం పడుతుందన్నారు. కొత్త పాలకమండలి ఏర్పడిన వెంటనే తెలంగాణ నుంచి వచ్చే సిఫార్సు లేఖలను ఆమోదించి తిరుమల దర్శనం సదుపాయాలు కల్పిస్తాం” అని హామీ ఇచ్చారు.