Friday, November 22, 2024

ఎయిడ్స్ నియంత్ర‌ణ మండ‌లి కొనుగోళ్ల‌లో గోల్ మాల్

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌ ఎయిడ్స్‌ నియంత్రణ మండలి (ఏపీశాక్స్‌) రిజిస్టర్ల టెండర్లలో కొను’గోల్‌మాల్‌’ జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ప్రజాసొమ్మును ఆదా చేసేందుకు ప్రయత్నిస్తుంటే శాక్స్‌ అధికారులు అసలు టెండరే లేకుండా రూ.1కోటి 10 లక్షల వర్క్‌ను కేంద్రీయ భండార్‌ సంస్థకు కట్టబెట్టారు. అడ్వాన్స్‌ కింద గత నెల్లో రూ.50 లక్షలు చెల్లించారు. సీన్‌కట్‌ చేస్తే కేంద్రీయ భండార్‌ సంస్థను ఆంధ్ర ప్రదేశ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎంఐడీసీ) తాజాగా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. నిబంధనల ప్రకారం ఏపీఎంఐడీసీ ద్వారా అనుమతులు తీసుకొని టెండర్‌ ప్రక్రియను నిర్వహించాల్సి ఉండగా శాక్స్‌ అధికారులు నిబంధనల్ని ఉల్లంఘించడం వెనుక కాసుల కక్కుర్తి ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలాంటి నోట్‌ ఫైల్‌ గాని ఫైల్‌ ప్రాసెస్‌ కూడా జరగకుండా నడిపిన ఈ అడ్డగోలు వ్యవహారంలో శాక్స్‌ డివిజనల్‌ అసిస్టెంట్‌, ఆర్థిక వ్యవహారాలు చూసే మరో ఉద్యోగి చక్రం తిప్పారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

రెగ్యులర్‌ ఫైనాన్స్‌ డైరెక్టర్‌, లేకుండానే కోట్ల లేవాదేవీలుకు అనుమతి ఇచ్చింది ఎవరు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎన్ని రిజిస్టర్స్‌ అవసరమో క్షేత్ర స్థాయి సిబ్బంది నుండి గాని లేదా జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ విభాగం నుండి అంచ నాలు తెప్పించకుండానే హడావుడిగా వర్క్‌ ఆర్డర్స్‌ ఇవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతు న్నాయి.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ- రాష్ట్రములో ఎయిడ్స్‌ నియంత్రణకు నోడల్‌ ఏజెన్సీ. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, వైద్య, ఆరోగ్య శాఖ అధీనంలో ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, ఏపీ శాక్స్‌ అధ్యర్యంలో ప్రాజెక్ట్‌ పనిచేస్తుంది. రాష్ట్ర వ్యాప్తముగా 26 జిల్లాల్లో సుమారు 1200 ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో ప్రధానముగా 4 కాంపౌనెంట్స్‌ ఉన్నాయి. ఐసీటీ-సీ (ఇంటిగ్రే-టె-డ్‌ కౌన్సిలింగ్‌ -టె-స్టింగ్‌ సెంటర్‌ ) , యాంటీ- రైట్రోవైరల్‌ ట్రీ–టె-్మంట్‌ (ఏ ఆర్‌ టి), సెక్సువల్‌ ట్రాన్సమి-టె-డ్‌ డిసిజెస్‌ (ఎస్‌ టి డి ) బ్లడ్‌ సేప్టీn (బి ఎస్‌ ) ఈ కాంపౌనెంట్స్‌ లలో కౌన్సిలర్స్‌, ల్యాబ్‌ -టె-క్నీషియన్‌, ఫార్మాసిస్ట్‌, స్టాఫ్‌ నర్స్‌ వంటి కీలకమైన ఉద్యోగులకు రిజిస్టర్లు ఎక్కువ మొత్తములో అవసరమవుతాయి.

చక్రం తిప్పుతున్నారు
కమిషనర్‌, ఫ్యామిలీ వెల్ఫేర్‌ జె.నివాస్‌ ఏపీ శాక్స్‌, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా పూర్తి అద నపు బాధ్యతలు చూస్తున్నారు. అడిషనల్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ అన్ని వ్యవహారాలు తానై నడిపిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. బసిక్‌ సర్వీస్‌ డివిజన్‌, డివిజనల్‌ అసిస్టెంట్‌ మరియు ఫైనాన్స్‌ వ్యవహారాలు చూసే మరొక కీలక వ్యక్తి ఈ రిజిస్టర్స్‌ ప్రింటింగ్‌ వ్యహారంలో ఒక విధి విధానం లేకుండా ఈ కేంద్రీయ బండార్‌- సంస్థకి -టె-ండర్‌ ఇవ్వటం వెనుక మతలబు ఉంది. ఒక సంస్థకు వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చే ముందు ఆ సంస్థ ఇచ్చిన -టె-ండర్‌ కొటేషన్స్‌ ఎక్కువుగా కోడ్‌ చేశారా? లేదా తక్కువగా కోడ్‌ చేశారా అన్నది చూడాలి. కానీ ఇక్కడ ఎలాంటి బహిరంగ -టె-ండర్స్‌ లేకుండానే ఇష్టం వచ్చిన రేటు-, ఇష్టం వచ్చిన వారికి కట్టపెట్టిన వైనం చూస్తేనే దీని వెనుక ఉన్న సిండికేట్‌ గ్రూప్‌ అక్రమాలకు ఆస్కారం ఇచ్చినట్టు- తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement