ఆభరణా
30 తులాల వెండి సామగ్రి అపహర
ఇచ్ఛాపురం , అక్టోబర్ 28 ( ప్రభ న్యూస్ ): పట్టణంలోని ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది రైల్వే స్టేషన్ కు కూతవేటు దూరంలోనే జరిగిన ఈ చోరీలో లో భాగంగా రూ . 16.57 లక్షల విలువైన సొత్తు అపహరణ కు గురికావడం పోలీసులకు సవాల్ గా మారింది. వివరాల్లోకి వెళితే అనపర్తి కి చెందిన మన మల్లిడి రామి రెడ్డి గత 30 సంవత్సరాల నుండి ఇచ్చాపురం లో స్థిరపడ్డారు. దసరా పండక్కి స్వగ్రామానికి వెళ్లిన రామ రెడ్డి అక్కడే 17న అనారోగ్యంతో మృతిచెందారు.
కుటుంబ సభ్యులందరూ తాళంవేసి అనపర్తి లోనే ఉన్నారు ఇచ్చాపురంలో వారి స్వగృహం నందు చనిపోయిన రామిరెడ్డి గారి తమ్ముడు రామచంద్రా రెడ్డి రోజు రాత్రి వచ్చి పడుకునే వారు ఆయన కూడా సోమవారం రాత్రి బయలుదేరి ఆనపర్తి కు బుధవారం పెద్ద కర్మ కోసం వెళ్ళిపోయారు. గురువారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు గోడ ఎక్కి ఇంటిలోని ప్రహరీ లోనికి ప్రవేశించి ముందు గది తలుపు తాళం వేరే తాళం తో తీసి ప్రవేశించినట్లు చెబుతున్నారు.
లోపల వెళ్లి బెడ్ రూమ్ లో ఉన్న బీరువాలు బద్దలుకొట్టి బంగారు చైన్లు నక్లెసులు ఉంగరం మొదలగునవి మొత్తo రూ. 16.40 లక్షల 82 తులాల బంగారు ఆభరణాలు, రూ. 17 వేలు విలువైన 34 తులముల వెండి ఆభరణములు దొంగిలించినట్లు రామి రెడ్డి తనయుడు మల్లిడి రామకృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము ఇంట్లో లేనంత కాలం తన బాబాయి రామచంద్రారెడ్డి నిద్రించే వారని పెద్ద కర్మ కోసం ఆయన కూడా స్వగ్రామానికి బయలుదేరు వచ్చారని చెబుతున్నారు. ఫిర్యాది అనపర్తి నుండి ఉదయం విషయం తెలిసి బయలుదేరి సాయంత్రం ఇంటికి వచ్చి తన మామయ్య సహాయంతో ఇళ్లు అంతా వెతికి తన తల్లి వద్ద నుండి ఇ వివరాలు తీసుకొని నిర్ధారించుకున్న ట్లు ఎస్ఐ వి. సత్యనారాయణ తెలిపారు. ఘటనా స్థలాన్ని సీ ఐ వినోద్ బాబు పరిశీలించారు క్లూస్ సేకరణ బృందాలు ఆధారాలు సేకరించి వెళ్లారు పట్టణ పట్టణ ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.