Friday, November 22, 2024

Simhachalam – అప్పన్న ద్వజస్థంభంకు స్వర్ణకాంతులు

(ఆంధ్ర ప్రభ బ్యూరో విశాఖ పట్నం)సింహాచలం..దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహా లక్ష్మీనృసింహ స్వామి ద్వజస్థంభం స్వర్ణకాంతులీనుతుంది. ఇప్పటి వరకు ఈ ద్వజస్థంభం ఇత్తడి తాపంతో భక్తులకు దర్శనమిచ్చేది. అయితే బంగారు తాపడం చేయించేందుకు ప్రముఖ వస్ర్త, నగల వ్యాపార సంస్థ సిఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ ముందుకు వచ్చారు. సుమారు 1.8 కేజీల బంగారం (1802 గ్రాములు)తో ఈ ద్వజస్థంబానికి స్వర్ణతాపడం పనులు పూర్తి చేయించారు. ఇక మీదట అప్పన్న భక్తులకు సీింహాద్రినాధుడి ద్వజస్థంభం దర్శనం బంగారు కాంతులతో కానరానుంది.

బుధవారం ఉదయం నుంచి తాపడం పనులు పూర్తి చేశారు. సాయంత్రం ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ ఆధ్వర్యంలో ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, పురోహితులు కరి సీతారామాచార్యులు, ఇన్ చార్జ్ ప్రధానార్చక వెంకటరమణాచార్యులు, ఉప ప్రధానార్చకులు నరసింహం ఆచార్యులు, అర్చక పరివారం, వేద పండితులు ఆయా పూజాది కార్యక్రమాలను శాస్ర్తోక్తంగా జరిపించారు. తొలుత విశ్వక్సేన, పుణ్యహవచనం, మహాసంప్రోక్షణ, షోడసోపచార పూజలు, గరుడ మూలమంత్రం, పంచసూక్తాలతో ప్రత్యేక హోమం నిర్వహించారు. అనంతరం మహాపూర్ణాహుతి ప్రధాన కలేశలోనే పవిత్ర జలాలను ఆలయ బేడా మండపం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి అందులో జలాలుతో సంప్రోక్షణ గావించారు. తదుపరి దర్పణ సేవ నిర్వహించారు.

. ఆలయ ఇవో వి.త్రినాధరావు, దాత సిఎంఆర్ సంస్థ గ్రూప్ అధినేత మావూరి వెంకటరమణ, ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు, దినేష్ రాజ్, శ్రీదేవి, సంపెంగ శ్రీనివాసరావు, సతీష్, శ్రీదేవివర్మ, రామలక్ష్మి, వంకాయల సాయినిర్మల తదితరులంతా పాల్గొన్నారు. ఆలయ ఏఇఓ భ్రమరాంబ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, వివిధ విభాగాల అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement