నంద్యాల బ్యూరో, డిసెంబర్ 2 : రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు ఓ యువ రైతు ఎద్దుల బండి యాత్ర చేపట్టాడు. రైతుల సమస్యలను, వారు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలను, పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు, యువ రైతు ఈ ఎద్దుల బండి యాత్ర చేపట్టారు.
హిందూపురం నుంచి మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం వరకు ఈ యాత్ర చేపట్టారు. సోమవారం నంద్యాల జిల్లాలో యువరైతుకు జనసేన అభిమానులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. 13 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. యాత్ర కోసం ఊరూరా జనసేన అభిమానులు, కార్యకర్తలు స్వాగతంకు ఏర్పాట్లు చేస్తున్నారు.
- Advertisement -