తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరికి వరద ఉధృతి తగ్గింది. భద్రాచలం వద్ద వరద కాస్త తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం బ్యారేజీ గోదావరి ఉధృతి తగ్గుముఖం పట్టింది. బ్యారేజీ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలో 11.70 అడుగులకు నీటిమట్టం తగ్గింది. బ్యారేజీ 175 గేట్లు ఎత్తి 9.90 లక్షల క్యూసెక్కుల నీరును దిగువకు అధికారుల విడుదల చేశారు.
పోలవరం ప్రాజెక్ట్ వెనకకు మళ్లిన వరద నీటితో ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల్లో వరద నెమ్మదిగా ప్రవహిస్తోంది. వరద తీవ్రతతో విలీనమండలాలైన ఎటపాక, కూనవరం, వీఆర్ పురం మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ముంపు రెండో రోజూ కొనసాగింది. దేవీపట్నం మండలంలోని 30 గ్రామాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. రాకపోకలు స్తంభించడంతో నాటు పడవలపైనే ప్రజల రాకపోకలు కొనసాగిస్తున్నారు.