Tuesday, November 26, 2024

ఈతకు వెళ్లి అనంత లోకాలకు.. ప్రకాశం జిల్లాలో చిన్నారుల మృతి

ప్రకాశం : సరదా కోసం ఈతకు వెళ్లిన విద్యార్థులు గుంతలో పడి మృత్యువాత పడిన ఘటన బుధవారం ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలో చోటు చేసుకుంది. పేరం గుడి పల్లి సర్పంచ్ ఇండ్ల సుజాత కుమారుడు ఇండ్ల దినేష్ (13), ఇండ్ల శ్రీనివాసులు కుమారుడు ఇండ్ల లోకేష్ చింతలపాలెం లోని జెడ్ పి హెచ్ హై స్కూల్ నందు ఎనిమిదో తరగతి చదువుతున్నారు బుధవారం పాఠశాలలో జరిగే రిపబ్లిక్ దినోత్సవాలకు హాజరై తిరిగి గ్రామానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వారిని విధి వక్రీకరించింది. సరదా పేరట మృత్యువును తీసుకువచ్చింది.

వారు గ్రామ సమీపంలో రైల్వే మార్గం కు అవసరమయ్యే మట్టిని సమకూర్చేందుకు రైల్వే కాంట్రాక్టర్ గుంతలు తీసి వదిలివేయగా ఇటీవల కురిసిన వర్షాలకు అవి నిండాయి. ఆ నీటిలో సరదాగా ఆనందంగా ఈత తో గడుపుదామని వెళ్ళినా వారిరువురు నీటి గుంతలో చిక్కేకొగ ఈ విషయం గ్రామస్తులు తెలుసుకొని వారిని బయటికి తీసి కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఇరువురి విద్యార్థులు మృత్యువాత పడినట్టు వైద్యులు ధృవీకరించడం తో ఈ విషాదం మిగిల్చింది. ఇది రైల్వే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ విద్యార్థులు మృత్యువాత పడ్డారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement