Saturday, November 16, 2024

AP: కాల్వ‌లో ఈత‌కు దిగి… న‌లుగురు గ‌ల్లంతు

బాప‌ట్ల జిల్లా నాగ‌రాజు కాల్వ‌లో ఘ‌ట‌న
సూర్యలంక విహార యాత్ర‌కు వ‌చ్చిన‌
హైద‌రాబాద్ కు చెందిన కూక‌ట్ ప‌ల్లి వాసులు
ప‌దేళ్ల బాలుడితో స‌హా కొట్టుకుపోయిన న‌లుగురు
మృత‌దేహ‌ల కోసం గాలిస్తున్న గ‌జ ఈతగాళ్లు

బాపట్ల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బాపట్ల – గుంటూరు రోడ్ లోని నాగరాజు కాల్వలో ఈతకు వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. అయితే, గల్లంతైన యువకులు హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లికి చెందిన వాసులుగా గుర్తించారు. బాపట్లలోని సూర్యలంక తీరానికి విహార యాత్రకు వచ్చి సమీపంలోని కాలువలో ఈతకు దిగి యువకులు కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

మృతులంతా కూక‌ట్ ప‌ల్లి వాసులే…
కాగా, గల్లంతైన వారి పేర్లు సన్నీ, సునీల్, కిరణ్, నందు అని గుర్తించారు. మొత్తం నలుగురు గల్లంతు కాగా, అందులో 10సంవత్సరాల బాలుడితో పాటు ముగ్గురు యువకులు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. నలుగురు మృతదేహాల కోసం గజ ఈతగాళ్లతో వెతికిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement