Thursday, November 21, 2024

వైభ‌వంగా ప్రారంభమైన అమరావతి హెచ్ఆర్ చాఫ్టర్ కాంక్లేవ్

నగరంలోని గవర్నపేట హోటల్లో అమరావతి హెచ్ ఎఫ్ చాప్టర్ ఆధ్వర్యంలో హెచ్ఆర్ కాంక్లేవ్ అట్టహాసంగా ప్రారంభమైంది. అమరావతి హెచ్ఆర్ చాప్టర్ ఐదవ సంవత్సర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం నిర్వహించిన కాంక్లేవ్ కి ముఖ్య అతిథిగా వరుణ్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ హెచ్ఆర్ లో ఈ మధ్య కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన మార్పులను వివరించారు. లేబర్ ఆక్ట్ తో పాటు వేజెస్ యాక్ట్, కంపెనీ యాక్ట్ వంటి ఇతర చట్టాల గురించి అందరికీ అవగాహన పరిచారు. లేబర్ కోడ్స్ తోపాటు కి ఇంప్లిమెంటేషన్ పై అందరికీ సూచనలు, సలహాలు అందించారు. అలాగే హెచ్ ఆర్ అనల్తిటిక్స్ పై మిడిల్ ఎర్త్ హెచ్ ఆర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ నితిన్ శంకర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎంగేజ్మెంట్ యాక్టివిటీ తో పాటు హెచ్ఆర్ టాపిక్స్ పై డిబేట్ నిర్వహించారు. హెచ్ఆర్ అమరావతి చాప్టర్ వ్యవస్థాపక అధ్యక్షుడు తల్లం రవితేజ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కాంక్లేవ్ కి విశాఖపట్నం, హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, కలకత్తా, ముంబై తో పాటు దేశం నలుమూలల నుండి పలు పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించిన హెచ్ఆర్ లు, పెద్ద ఎత్తున కళాశాలలో ఎంబీఏ చదువుతున్న విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement