సైకిల్ ఇంటి బయట ఉండాలి, తాగేసిన టీ గ్లాసు సింక్ లోనే ఉండాలి, కానీ ఇంట్లో ఎప్పుడూ ఫ్యాన్ తిరుగుతూనే ఉండాలని ఎపి జగన్ వేసిన సెటైర్ పై సోమవారం జనసేన నేత నాగబాబు ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు..
‘గ్లాస్ సింక్ లో ఉన్నా కూడా తెల్లారితే మళ్లీ తేనేటి విందు ఇస్తుంది.. కానీ, ఫ్యాన్ రెక్కలు విరిగితే విసనకర్ర ఇచ్చినంత గాలి కూడా ఇవ్వదు’ అంటూ జగన్ కు నాగబాబు కౌంటర్ ఇచ్చారు. అయినా సారూ.. మీరు పబ్లిక్ మీటింగ్స్ లలో ప్రాసలు, పంచుల మీద పెట్టిన శ్రద్ధలో సగం ‘ప్రజాపరిపాలన’ మీద పెట్టుంటే బాగుండేదంటూ జగన్కు హితవు పలికారు. చివరగా అయామ్ టెల్లింగ్ దట్.. అంటూ కింగ్ సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ తో నాగబాబు ట్వీట్ చేశారు.