Friday, November 22, 2024

Breaking : ఏపీ టెన్త్ ఫలితాల్లో బాలికలే టాప్… 72.26 శాతం ఉత్తీర్ణత..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. రిజల్ట్ లో 72.26 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా. బాలికలదే పై చేయిగా ఉందని మంత్రి బొత్స తెలిపారు. బాలురు ఉత్తీర్ణత 69.27 శాతం కాగా, బాలికల ఉత్తీర్ణత 75.38 శాతంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 6.5 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాసిన సంగతి తెలిసిందే. కాగా ఈ పరీక్ష ఫలితాల్లో మొదటి స్థానంలో మన్యం జిల్లా, చివరి స్థానంలో నంద్యాల జిల్లా నిలిచిందన్నారు.

అదేవిధంగా టెన్త్ సప్లమెంటరీ పరీక్షలు జూన్ 2 వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గతేడాది కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగింది. మార్కులు తక్కువ వచ్చినా.. ఫెయిల్ అయినా..క్షణికావేశం వద్దని తెలిపారు. విద్యార్థులూ ఎలాంటి ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. కన్నవాళ్లకు కడుపుకోతలు పెట్టవద్దని ఏపీ ఎస్ఎస్సీ బోర్డు సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement