శ్రీ సత్య సాయి బ్యూరో అక్టోబర్ 29: (ప్రభన్యూస్) – శరన్నవరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా ముగియడంతో కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పాలకమండలి సభ్యులు ఆలయ సిబ్బందికి ఆదివారం వస్త్ర పంపిణీ చేశారు. కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా దసరా ఉత్సవాలు మహోన్నతంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో ఆలయ అర్చకులు , ఆలయ సిబ్బంది సేవలను గుర్తించి వస్త్ర పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు పాలకమండలి సభ్యులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. వారి విశేష కృషి ఫలితంగా శరన్నవరాత్రి వేడుకల్లో ప్రతిరోజు అలంకరణ ఎంతో విశేషంగా నిలిచిందన్నారు. వైదిక పూజా కృతులు భక్తులకు ఎంతగానో ఆకట్టుకున్నాయని, ఆలయ అర్చకులు భక్తులు మనసుల్లో చిరస్థాయిగా నిలిచేలా పూజలు నిర్వహించారని వారు అభిప్రాయపడ్డారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు కల్పనలో సిబ్బంది సేవ నిరతిని ఎంతగానో కొనియాడారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రప్రథమంగా అర్చకులకు , సిబ్బందికి వస్త్ర పంపిణీ చేయడంతో వారు పులకించి పోయారు. సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఆర్చకులు వెంకటనరసింహ చార్యులు, పార్థసారథి స్వామి , ధర్మకర్తల మండలి సభ్యులు గొట్లూరు అశ్వర్థ నారాయణ, భరణి గోపాల్ రెడ్డి, శివకృష్ణకుమార్ మలిశెట్టి వేణుగోపాల్, మల్లికార్జున , రవీంద్రారెడ్డి, వెంకటరంగారెడ్డి, శివయ్య టీచర్ , గురలింగగస్వామి గంగులప్ప .దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.