Tuesday, November 26, 2024

రిమ్స్‌లో ఘరానా దొంగ.. మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి బంగారం దోపిడీ

ప్రభన్యూస్‌ : కడప రిమ్స్‌ ఆసుపత్రిలో ఒక ఘరానా దొంగ చేతిలో పలువురు మహిళలు బాధితులు అవుతున్నారు. డాక్టర్‌ చెప్పాడు అంటూ వచ్చి మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి వారి మెడలోని బంగారు గొలుసును దోపిడీ చేయడం కేటుగాడికి అలవాటుగా మారింది, ఇటీవలే జూన్‌ ఒకటో తేదీన రిమ్స్‌ ఆస్పత్రిలోని కంటి విభాగంలో ఒక మహిళకు మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి ఆమె మెడలో నుంచి బంగారు గొలుసు దొంగిలించిన ఘటన మరువకముందే ఆస్పత్రిలోని గైనకాలజీ విభాగంలో మరో మహిళకు మత్తు మందు ఇచ్చి ఆమె మెడలో నుంచి 30 గ్రాముల బంగారు దూసుకెళ్ళాడు, ఆస్పత్రిలో ఉదయం 8 గంటల సమయంలో జరిగే సిబ్బంది షిప్టింగ్‌ సమయాన్ని అవకాశంగా తీసుకొని సిబ్బంది ఎవరూ లేని సమయంలో డాక్టర్‌ చెప్పాడు ఇంజక్షన్‌ చెయ్యాలి అంటూ వచ్చి మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి దోపిడీ చేయడం జరుగుతోంది, అదేవిధంగా మంగళవారం ఉదయం కూడా గైనకాలజీ విభాగంలో బ్రహ్మంగారిమఠం, పీసీ పల్లికి చెందిన విజయలక్ష్మి అనే బాలింత దగ్గర కు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఆ మహిళ క్యాన్లా కు ఇంజక్షన్‌ ఇచ్చి మూడు తులాల బంగారు చైన్‌ దొంగిలించడం జరిగింది.

వారం రోజులు గడవక ముందే రిమ్స్‌ ఐపీ విభాగంలో రెండవ సంఘటన చోటు చేసుకోవడంతో ఆసుపత్రి లో సిబ్బంది,పేషెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటన వివరాలు తెలుసుకున్న రిమ్స్‌ సిఐ సదాశివయ్య, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావులు బాధితురాలిని విచారించారు. గత శుక్రవారం కాన్పు కోసం వచ్చిన బసిరెడ్డి విజయలక్ష్మి (26)ఈనెల ఆరో తేదీన కాన్పుల వార్డు లో మగబిడ్డను ప్రస్తావించడం జరిగింది. ఈ ఘటనపై బాధితురాలి భర్త సుధాకర్‌ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమ్స్‌ హాస్పిటల్‌ సదాశివయ్య దర్యాప్తు చేపట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement