విశాఖలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. కాకినాడ జిల్లాకు చెందిన ఓ వ్యాపారిని నమ్మించి మోసం చేసిన ఘటనలో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. 500 రూపాయల నోట్లతో 90 లక్షల రూపాయిలు ఇస్తే.. 2 వేల రూపాయల నోట్లతో కూడిన కోటి రూపాయల అమౌంట్ ఇస్తామని నమ్మించాడు. దీనిపై కాకినాడకు చెందిన ఓ వ్యాపారికి విశాఖ వాసి ధర్మరాజు ఆఫర్ చేశాడు.
అయితే.. దీన్ని నమ్మి, పెద్ద మొత్తంలో డబ్బు తేరగా వస్తుందని ఆశపడ్డ కాకినాడ వ్యాపారి తన ఫ్రెండ్‌కు 90 లక్షల రూపాయలు ఇచ్చి పంపించాడు. అయితే.. వారి దురాశను ఆసరగా చేసుకున్న విశాఖ వాసి.. అతడిని మస్కా కొట్టి 60 లక్షలు ఎత్తుకెళ్లాడు. దీంతో లబోదిబో మంటూ పోలీసులను బాధితుడు ఆశ్రయించడంతో గంటల వ్యవధిలోనే కేసు ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేశారు.