అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్ర ప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ విద్యుదుత్పత్తిలో సరికొత్త రికార్డు సృష్టించింది. శని వారం 105.620 మిలియన్ యూనిట్ల (5137 మెగా వాట్ల) విద్యుదుత్పత్తి నమోదు చేసిం ది. శుక్రవారం అర్ధరాత్రి 12 నుంచి శనివారం అర్ధరాత్రి 12 గంటల వరకూ సుమారు 114 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేయగా జెన్ కో వినియోగానికి పోనూ 105.620 మిలియన్ యూనిట్లు- గ్రిడ్‌కు సరఫరా చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఒకరోజులో ఇదే అత్యధిక ఉత్పత్తి కావడం విశేషం. అత్యధిక విద్యుదుత్పత్తి చేయడానికి అన్ని విధాల సహకారం అందించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ఇంధన శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డికి, కేంద్ర రైల్వే, కోల్ మంత్రి త్వ శాఖల అధికారులకు, ఏపీ జెన్ కో మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆయన ఈ మేరకు టీ-్వట్ చేశారు.
మరింత అంకిత భావంతో విధులు: ఎండీ
రికార్డు స్థాయి ఉత్పత్తి సాధించినందుకు ఏపీ జెన్ కో ఉద్యోగులను మేనేజింగ్ డైరెక్టర్ చక్రధర్ బాబు అభినందించారు. వేసవి తీవ్రత నేపథ్యంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టు-కుని గరిష్ఠ స్థాయిలో ఉత్పత్తి చేసి రాష్ట్ర అవస రాలను తీర్చడానికి మరింత అంకితభావంతో పని చేయాలని ఉద్యోగులకు ఉద్భోధించారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండు పెరుగుతున్నందున ఉత్పత్తి పెంచేందుకు ప్రభుత్వ సహకారంతో ఏపీ జెన్ కో అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని ఎండీ పేర్కొన్నారు. వీటీ-పీఎస్ లో 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించిన కొత్త యూనిట్ విద్యుదుత్పత్తి త్వరలో ప్రారం భించేందుకు ఏర్పాట్లు- చేస్తున్నామని వివరించారు. లోయర్ సీలేరులో మరో 230 మెగావాట్ల ఉత్పత్తి కోసం రెండు యూనిట్ల నిర్మాణ పనులు త్వరగా చేపట్టి ఏడాదిలో పూర్తిచేసేందుకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు.