అమరావతి, ఆంధ్రప్రభ : గిరిజన సహకార సం(జీసీసీ) కాఫీ కొనుగోలు ధరను పెంచింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కాఫీ ధరలు పెరగడంతో ప్రైవేటు వర్తకులు అధిక ధరకు కాఫీ గింజలను కొనుగోలు చేస్తున్నారని, జీసీసీ కూడా ధరలు పెంచాలని నిర్ణయించింది. పార్చ్‌మెంట్, చెర్రీ(గు) కిలోకి రూ.10 ధరను పెంచుతున్నట్టు ప్రకటించింది. చెర్రీ కిలో రూ.135 నుంచి రూ.145, పార్చ్‌మెంట్ రూ.270 నుంచి రూ.280 ధరలుగా జీసీసీ నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో డివిజనల్ జీసీసీ ఉద్యోగులను ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో గిరిజన గ్రామాలకు వెళ్లి పెంచిన ధరలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. కాగా గిరిజన సహకార సంస్థ కాఫీ ధరలు పెంపొందించడంపై ఆదివాసీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.