Monday, November 18, 2024

ఇంట్లో గ్యాస్ లీక్.. స్వల్ప ఆస్తి నష్టం

కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని పాతపేట రాముల దేవాలయం దగ్గర ఓ ఇంట్లో గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి. దీంతో ఇంటిలోనివారు భయాందోళన గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేసుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ప్రమాదంలో రూ. 60 వేల ఆస్తినష్టం జరిగింది. అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక అధికారి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement