Tuesday, November 26, 2024

స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాలంటే తెలంగాణ తరహా మిలియన్‌ మార్చ్ శ‌ర‌ణ్యం… గంటా

విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు ప‌రం కాకుండా ర‌క్షించుకోవాలంటే తెలంగాణ తరహా మిలియన్‌ మార్చ్ ఉద్యమం చేయాల‌ని అన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. విశాఖ స్టీల్ ప్లాంట్ వ‌ద్ద కార్మికుల ఆందోళ‌న‌లో పాల్గొన్నా గంటా విశాఖ ఉక్కు కర్మాగారం కోసం రాజీనామా చేశానని చెప్పారు. ఇప్పటికే తాను రాజీనామా చేసినప్పటికీ స్పీకర్ ఫార్మాట్‌లో చేయలేదన్న విమర్శలు వచ్చాయని, అందుకే అన్ని ఫార్మాట్‌లలో రాజీనామా లేఖ ఇస్తున్నట్లు వివరించారు. కార్మిక సంఘాలకు అండగా నిలుస్తానని ఆయన స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ అంశంపై కేబినెట్ భేటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీని కలిసి ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునేలా పోరాడాలన్నారు. స్టీల్ ప్లాంట్‌ను దక్కించుకునేందుకు అన్ని పక్షాలు ఏకతాటిపైకి రావాలని గంటా పిలుపు ఇచ్చారు. కేంద్రానికి సీఎం జగన్‌ రాసిన లేఖను స్వాగతిస్తున్నామన్నారు. అయితే లేఖలు రాస్తే ఢిల్లీలో పెద్దల మనసు కరగదన్నారు. అసెంబ్లీ ఏర్పాటు చేసి ఏకగ్రీవ తీర్మానం చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర కేబినెట్‌ భేటీ నిర్వ‌హించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకించాల‌ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement