ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు గన్నవరం ఎయిర్‌పోర్టులో జనసేన నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయల్దేరారు. పవన్ నేడు సచివాలయానికి రానున్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారి సచివాలయానికి రానున్న ఆయన.. రెండో బ్లాక్‌లోని తన ఛాంబర్‌ను పరిశీలించనున్నారు. ఉప ముఖ్యమంత్రిగా బుధవారం తన ఛాంబర్లో బాధ్యతలు తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం ఉంది. పవన్ రాక సందర్భంగా ఆమరావతి రైతులు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు..
కాగా పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులను పరిచయం చేసుకున్నారు. రేపు సచివాలయంలో బాధ్యతల స్వీకరణపై చర్చించారు..