Friday, January 24, 2025

AP | పొగమంచు దుప్ప‌ట్లో గన్నవరం… విమాన రాకపోకలకు అంతరాయం

(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో ) : ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా దట్టమైన పొగ మంచు అలుముకుంది. శుక్రవారం తెల్లవారుజాము నుండి పొగమంచు జిల్లా వ్యాప్తంగా కమ్మేసింది. మంచు దుప్పటిలో జిల్లా గజగజ వణుకుతోంది. పొగ మంచు పూర్తిస్థాయిలో కమ్మేయడంతో సాధారణ జనజీవనానికి తీవ్ర ఇబ్బందిగా పరిణమించింది. వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడుతుంది. అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం గన్నవరం పరిసర ప్రాంతాలలో పొగ మంచు దట్టంగా అలుముకోవడంతో విమానాల రాకపోకులకు అంతరాయం కలిగింది.

హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చే ఇండిగో విమానం పొగమంచు, వెలుతురు లేని కారణంగా ప్రస్తుతం గాలిలో చక్కర్లు కొడుతోంది. ల్యాండింగ్ కి అనుమతి రాకపోవడంతో సుమారు గంటకు పైగా చక్కర్లు కొట్టిన విమానం ఇంధనం అయిపోవడంతో తిరిగి ఇంధనం నింపుకునేందుకు రాజమండ్రి విమానాశ్రయానికి వెళ్ళింది. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలిస్తేనే ల్యాండింగ్ కి అనుమతి వచ్చే పరిస్థితి నెలకొంది. బెంగళూరు నుంచి విజయవాడ, విశాఖపట్నం నుండి విజయవాడ వచ్చే ఇండిగో విమానాల రాక సైతం మరింత ఆలస్యం అవుతోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement