శ్రీకాకుళం జిల్లాలో వేరుశెనగ కాయల మాటున గంజాయి తరలిస్తున్న ముఠా గుట్టురట్టయింది. సిఐ వినోద్ బాబుకు అందిన పక్కా సమాచారంతో పట్టణ ఎస్సై సత్యనారాయణ 9 మంది సిబ్బందితో కలసి పాత టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఎయిచర్ వ్యానులో అరుకు నుండి బీహార్ తరలిస్తోన్న 900 కిలోల(180 ప్యాకెట్లు) గంజాయి పట్టుబడింది. బహిరంగ మార్కెట్ లో దీని విలువ రూ.36 లక్షలు ఉంటుందని డిఎస్పీ తెలిపారు. ఈ కేసులో పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్ కు చెందిన 3 గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement