గంగవరం పోర్టులో వాటాల బదిలీకి ఏపీ ప్రభుత్వం కమిటీని నియమించింది. ప్రభుత్వ వాటాల, పెట్టుబడుల ఉపసంహరణపై ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. వాటాలను అదానీ పోర్ట్స్, ఎస్‌ఈజెడ్‌లో విలీనం, బదిలీకి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. గంగవరం పోర్టులో 58.1 శాతం వాటా విండీ లేక్‌సైడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కలిగి ఉంది. ఆ వాటాను అదానీ పోర్ట్స్‌కు బదిలీ చేసేందుకు అంగీకరించింది. ఏపీ మారిటైమ్ బోర్డు సిఫార్సుతో అదానీ సెజ్‌లో విలీనానికి సమ్మతించింది. సీసీఎల్‌ఏ నీరబ్‌కుమార్ నేతృత్వంలోని ఆరుగురు అధికారులతో కమిటీ ఏర్పాటైంది. జీపీఎల్‌లో పెట్టుబడుల ఉపసంహరణపై రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement