Wednesday, January 22, 2025

Gampalagudem l ఆటోను ఢీకొన్న ఆర్టీసి బస్స

గంపలగూడెం,జనవరి 22(ఆంధ్రప్రభ):మండలంలోని పెనుగొలను గ్రామాన్ని బుధవారం ఉదయం దట్టమైన పొగ మంచు కప్పివేయడంతో ప్రమాదం చోటుచేసుకుంది వివరాల్లోకి వెళ్తే ఊటుకూరు నుండి వలస కూలీలు ఉన్న ఆటో పెనుగొలను వైపు వెళ్తుండగా అటువైపు నుండి వస్తున్న తిరువూరు ఆర్టీసి డిపోకు చెందిన బస్సు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి

మిగిలిన వారందరూ క్షేమంగా ఉండటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు పొగ మంచు అధికంగా ఉండటంతో బస్సు చోదకునికి ఆటో కనపడకపోవడం వలన ప్రమాదం జరిగింది గాయపడ్డ ఇద్దరిని అంబులెన్స్ ద్వారా వైద్యశాలకు తరలించారు పోలీసులు సంఘటనా స్థలికి వచ్చి పూర్తి వివరాలు సేకరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement