శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా రిలీజ్ కానుండగా.. ప్రమోషన్స్ లో భాగంగా నేడు రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు మేకర్స్.
‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్టుగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ రానున్నారు. ఈ భారీ మెగా ఈవెంట్ కడియం మండలం వేమగిరి జాతీయ రహదారి పక్కన ఉన్న లేఅవుట్‌లో జరుగుతుంది. దీనికోసం పోలీసులు పక్కా బందోబస్తుతో సిద్ధంగా ఉన్నారు. ఈ ఈవెంట్ కోసం కోలకత్తా, చెన్నై రహదారిపై ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. భారీ వాహనాలు గోదావరి నాలుగో వంతెన మీదుగా మళ్లిస్తున్నారు.