శ్రీహరికోట: గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా ఇస్రో తలపెట్టిన ‘టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్’ (టీవీ-డీ1) పరీక్ష విజయవంతమైంది. తొలుత ఈ ప్రయోగంలో సాంకేతిక లోపం తలెత్తడంతో కొంతసేపు వాయిదా పడిన విషయం తెలిసిందే. అనంతరం ఉదయం 10 గంటలకు ఈ ప్రయోగాన్ని చేపట్టగా.. టీవీ-డీ1 విజయవంతంగా గాల్లోకి లేచింది.
ఈసందర్భంగా ఇస్రో చైర్మెన్ సోమనాథ్ మాట్లాడుతూ… అయితే ఆ టీవీ-డీ1 మిషన్ రాకెట్ దాదాపు ధ్వని వేగం కన్నా అధిక వేగంతో దూసుకెళ్లినట్లు తెలిపారు. టీవీ-డీ1 పరీక్ష సక్సెస్ కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ను పరీక్షించడంలో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టామన్నారు. టీవీ-డీ1 వెహికల్ మ్యాక్ వేగంతో అంటే ధ్వని వేగంతో దూసుకెళ్లినట్లు వెల్లడించారు. నింగిలోకి వెళ్లిన తర్వాత.. అన్ని ప్రక్రియలు సవ్యంగా సాగినట్లు ఆయన తెలిపారు. మూడు పారాచూట్ల సాయంతో క్రూ ఎస్కేప్ మాడ్యూల్ బంగాళాఖాతంలో దిగినట్లు సోమనాథ్ చెప్పారు.